కోడిపందేల శిబిరంపై పోలీసుల దాడి
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:19 AM
కొండగంగుబూడి శివారు ఎస్.కోట సీతారాంపురం గ్రామ సమీపంలో భారీ కోడి పందెం శిబిరం నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ తన సిబ్బందితో బుధవారం మెరుపు దాడి చేశారు
22 మంది అరెస్టు ఫ రూ.61,330 స్వాధీనం
వేపాడ, అక్టోబరు 7 (ఆంద్రజ్యోతి): కొండగంగుబూడి శివారు ఎస్.కోట సీతారాంపురం గ్రామ సమీపంలో భారీ కోడి పందెం శిబిరం నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్ తన సిబ్బందితో బుధవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 22 మంది పందెం రాయుళ్లను ఆదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 పందెం కోళ్లు, 19 సెల్‌ఫోన్లు, 13 కార్లు, 10 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, రూ.61,330 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ సుదర్శన్ తెలిపారు. కొండగంగుబూడి పంచాయతీ ఏజెన్సీని పోలి ఉండడంతో అక్కడ అధికంగా కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుదర్శన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. పేకాట, కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.