Share News

నెల్లిమర్లలో పోలీసుల కవాతు

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:59 PM

: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం నెల్లిమర్ల పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు.

 నెల్లిమర్లలో పోలీసుల కవాతు
ప్రధాన రహదారిపై కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

నెల్లిమర్ల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం నెల్లిమర్ల పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. విజయనగరం ఎస్టీపీవో లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు, ప్రత్యేక దళాల సిబ్బందితో కలిపి సుమారు 200 మంది కవాతులో పాల్గొన్నారు. ఎంఐఎంఎస్‌ నుంచి ప్రారంభమైన కవాతు జరజాపుపేట వరకు జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటేయాలని అన్నారు. నెల్లిమర్ల మండలంలో ఇప్పటివరకు సుమారు వెయ్యిమందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా హింసను ప్రేరేపించినా లేదా హింసాత్మక చర్యల్లో పాల్గొన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భోగాపురం గ్రామీణ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎస్‌ఐ జి.గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 10:59 PM