Helmets పోలీసులూ హెల్మెట్లు ధరించాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:45 PM
Police Must Wear Helmets Too పోలీసులు విధిగా హెల్మెట్లు ధరించి రోడ్డుపైకి రావాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోలీ సులు నిబంధనలు పాటిస్తేనే ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణాలు చేస్తారన్నారు.
సీతానగరం (బలిజిపేట),ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): పోలీసులు విధిగా హెల్మెట్లు ధరించి రోడ్డుపైకి రావాలని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోలీ సులు నిబంధనలు పాటిస్తేనే ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణాలు చేస్తారన్నారు. శుక్రవారం బలిజిపేట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్డు భద్రత, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే సమస్యలను వాహనదారులకు అవగాహన కల్పించాలని, అప్పటికీ వినకపోతే జరిమానా విధించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు సంబంధిం చిన రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఈ పరిశీలనలో ఎస్‌ఐ సింహాచలం, ఏఎస్‌ఐ రమణ తదితరులు ఉన్నారు.