Share News

Police పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:49 AM

Police Martyrs’ Services Will Be Remembered Forever శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌, ఎస్పీ.. సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు.

Police   పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం
అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

బెలగాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌, ఎస్పీ.. సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. 1959లో లడక్‌లో 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ ఏటా సంస్మరణ దినోత్సవం జరుపుతున్నట్టు తెలిపారు. మన్యంలో జిల్లాలో కూడా ముద్దాడ గాంధీ, ఎస్‌కే ఇస్మాయిల్‌, జి.శ్రీరాములు, చిట్టిపంతులు చిరంజీవి, ఎస్‌.సూర్యనారాయణ వంటి వారు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని, వారిని మనం నిరంతరం స్మరించుకోవాలని పిలుపు నిచ్చారు. రూపు మార్చుకుని వస్తున్న తీవ్రవాదులు, శత్రువులను గుర్తుపట్టాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌, సోషల్‌ మీడియా నేరాల వంటి ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నా మన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి వారికి పండ్లు, నగదు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వ రరావు, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్పిత్‌ రహర్‌, పార్వతీపురం, పాలకొండ డీఎస్పీలు శేషయ్య, రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

45 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు : ఎస్పీ

పార్వతీపురం రూరల్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 45 సమస్యాత్మక పోలింగ్‌ కేం ద్రాలు గుర్తించినట్టు ఎస్పీ మాధవరెడ్డి చెప్పారు. బుధవారం నర్సిపురంలోని జడ్పీ, ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లు సహక రించాలన్నారు. ఎవరైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో సుధాకరరావు, ఎంపీడీవో రమేష్‌, సీఐ రంగనాఽథ్‌, ఎస్‌ఐ రాజేష్‌, రూరల్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్‌ స్వీకరణ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో రెండు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్ధితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. మూడు మండలాలకు ఒక సీఐ, డీఎస్పీ అందుబాటులో ఉంటారని తెలిపారు.

Updated Date - Oct 22 , 2026 | 12:49 AM