Share News

బొబ్బిలిలో పోలీస్‌ ఫ్లాగ్‌ మార్చ్‌

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:36 AM

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు, సీఐ కింతలి నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

బొబ్బిలిలో పోలీస్‌ ఫ్లాగ్‌ మార్చ్‌
ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

బొబ్బిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి బొబ్బిలి డీఎస్పీ రాకోటి గోవిందరావు, సీఐ కింతలి నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎరుకలివీధి, గొల్లవీధి, రావువీరివీధి, మెయిన్‌ బజారు, చినబజారు, బలిజిపేట, రోడ్డు తదితర ప్రాంతాలలో పోలీసు బలగాలు ర్యాలీగా సాగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెర్లాం, బాడంగి ఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:36 AM