Share News

పోలీస్‌ చెక్‌పోస్ట్‌ తనిఖీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:17 AM

న్నికల బందోబస్తులో భాగంగా పట్టణ శివారులో వెంకంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శనివారం ఎస్పీ మాధవరెడ్డి తనిఖీ చేశారు.

పోలీస్‌ చెక్‌పోస్ట్‌ తనిఖీ
చెక్‌పోస్ట్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల బందోబస్తులో భాగంగా పట్టణ శివారులో వెంకంపేట జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శనివారం ఎస్పీ మాధవరెడ్డి తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహి స్తున్న పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్ట్‌ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాహనాల తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదిలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల సందర్భంగా నగదు, మద్యం రవాణా వంటి కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు పార్వతీపురంలో మూడు, పాలకొండలో రెండు, సాలూరులో రెండు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 18 , 2026 | 12:17 AM