“Polamamba Vanangudi ” అందరి సహకారంతో పోలమాంబ వనంగుడి పునర్నిర్మాణం
ABN , Publish Date - May 11 , 2026 | 12:20 AM
“Polamamba Vanangudi Reconstruction with Everyone’s Support” అందరి సహకారంతో శంబర పోలమాబ వనం గుడి పునర్నిర్మాణం చేపడతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం వనం గుడి ఆవరణలో పోలమాంబ ధర్మకర్తల మండలి చైర్మన్ చినతిరుపతి, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మక్కువ రూరల్, మే10(ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో శంబర పోలమాబ వనం గుడి పునర్నిర్మాణం చేపడతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం వనం గుడి ఆవరణలో పోలమాంబ ధర్మకర్తల మండలి చైర్మన్ చినతిరుపతి, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వనంగుడి పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు శంబర గ్రామస్థులు, భక్తులు సహకరించాలని కోరారు. గ్రామపెద్దలు, దాతలు ముందుకొచ్చి విరాళాలు సేకరించా లన్నారు. ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. పండితుల సూచనల మేరకు గుడి పునర్నిర్మాణం ప్రారంభించాలని దేవదాయ శాఖాధికారులను ఆదేశించారు. అంతకుముందు వనంగుడిలో పోలమాంబను దర్శించుకుని పూజలు జరిపారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. కాగా వనంగుడిలో విగ్రహ స్థల మార్పిడి చేయాలంటే ముందుగా శాంతిహామం నిర్వహించాలని, తలనీలాలు, మొక్కులు తీర్చుకునేందుకు వేర్వేరుగా గదులు నిర్మించాలని, భక్తుల వంటావార్పునకు వీలుగా ఏర్పాట్లు చేయాలని పులువురు పెద్దలు కోరారు.