యువకుడిపై పోక్సో కేసు నమోదు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:34 AM
ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై సంతకవిటి పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.
సంతకవిటి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై సంతకవిటి పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక వంగర మండ లంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆ బాలికను ఇటీవల రాఖీ పండగ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల నుంచి స్వగ్రామానికి తీసుకువ చ్చారు. అయితే ఈనెల 1న తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆటోలో బొబ్బిలి తీసుకు వెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే మరుసటి రోజు బాలిక బొబ్బిలి బస్టాండ్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి, ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై బాలికను విచారించగా, సదరు యువకుడు కొంతకాలంగా తన వెంట తిరుగుతూ వివాహం చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని తెలిపింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు.