Share News

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:13 AM

ఎస్‌.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అదే పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించి, ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యాడు.

 ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

ఎస్‌.కోట రూరల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎస్‌.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అదే పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించి, ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యాడు. ఈ కేసులో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఈ వివరాలను ఆయన ఆదివారం వెల్లడిం చారు. ఎస్‌.కోట మండలం తిమిడి గ్రామానికి చెందిన అక్కవరపు ప్రవీణ్‌కుమార్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రాత్రివేళల్లో బాలికకు ఫోన్‌ చేసి, అసభ్యకరంగా మాట్లాడేవాడు. లైంగికంగా వేధించేవాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ మేరకు తల్లిదండ్రులు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించి నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Sep 14 , 2026 | 12:13 AM