Share News

Please tell me my horoscope, Swami. జాతకం చెప్పండి స్వామీ

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:13 AM

Please tell me my horoscope, Swami. జిల్లా పరిధిలోని ఓ నాయకుడు రాజకీయంగా కొంతకాలంగా కలిసి రావడం లేదని, తాననుకున్న పనులేవీ జరగడం లేదని తాజాగా స్వామీజీని ఆశ్రయించాడు. దీనిపై స్వామీజీ స్పందిస్తూ నాయనా? వచ్చే ఎన్నికల్లో నీకన్నీ కలిసొస్తాయని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

Please tell me my horoscope, Swami. జాతకం చెప్పండి స్వామీ

జాతకం చెప్పండి స్వామీ

స్వామీజీలు, పూజారులను కలుస్తున్న అభ్యర్థులు

శాంతి పూజలు, హోమాలూ చేస్తున్న వైనం

శృంగవరపుకోట, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి):

- జిల్లా పరిధిలోని ఓ నాయకుడు రాజకీయంగా కొంతకాలంగా కలిసి రావడం లేదని, తాననుకున్న పనులేవీ జరగడం లేదని తాజాగా స్వామీజీని ఆశ్రయించాడు. దీనిపై స్వామీజీ స్పందిస్తూ నాయనా? వచ్చే ఎన్నికల్లో నీకన్నీ కలిసొస్తాయని చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.

- వేపాడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం రాజకీయ ప్రాతినిధ్యం కోసం తహతహలాడుతోంది. ఈ దఫా ఎలాగైనా రాజకీయంగా పైచేయి సాధించాలని ఓ జ్యోతిష్యుడిని కలిసారు. గెలిచేందుకు ప్రత్యేకంగా పూజలు చేయించాలని ఆ జ్యోతిష్యుడు చెప్పారు. పోలింగ్‌ లోపు ప్రత్యేక పూజలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

- శృంగవరపుకోట మండలానికి చెందిన ఓ గ్రామానికి ప్రజాప్రతినిధిగా వ్యవహరించాలని ఓ నాయకుడు దశాబ్దకాలంగా తహతహలాడుతున్నాడు. తాను నమ్మిన ఓ పురోహితుడ్ని సంప్రదించి రాజకీయంగా తన గ్రహ బలం చూడాలని కోరాడు. గ్రహబలంలో దోషం వుందని, పూజలు చేస్తే పదవి వస్తుందని నమ్మపలకడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాడు.

- ఇలా జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు ప్రజా ప్రతినిధులుగా విజయం సాధించేందుకు స్వామీజీలు, జ్యోతిష్యులు, పురోహితులను నమ్ముతున్నారు. అదృష్టం పరీక్షించుకునేందుకు వారి చుట్టూ తిరుగుతున్నారు. గెలుపునకు యాగాలు, హోమాలు, పూజలు వంటివి చేసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. సతీసమేతంగా గుడి, గోపురాలను చుట్టేస్తున్నారు. వీరు వెళ్లేందుకు అవకాశం లేకుంటే భార్య, పిల్లలను ఆలయాలకు వెళ్లి పూజలు చేసి రావాలంటూ పురమాయిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పీడు పెరిగింది. అందులోనూ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం మరింత చురుగ్గా జరుగుతోంది. నవంబర్‌ ఒకటిన పోలింగ్‌ జరుగనుంది. మరోవైపు జిల్లా, మండల పరిషత్‌ బరిలో ఎవరెవరు ఉన్నారో తేలిపోయింది. అభ్యర్థులు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు స్వామీజీలు, పురోహితులు, జ్యోతిష్యులను ప్రసన్నం చేసుకోనే పనిలో పడ్డారు. తొలుత ఎక్కడ నుంచి ప్రచారం చేయాలి? ఏ రోజు ఏ దిక్కు నుంచి మొదలు పెట్టాలి?ఏఏ రోజుల్లో ఎన్నెన్ని ఇళ్లకు వెళ్లాలి? అంటూ సలహాలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పేరుతోనూ వీరి జాతకం లెక్కలు కట్టిస్తున్నారు. పోలింగ్‌ రోజున తన జాతక చక్రం ప్రకారం ఏఏ పేర్లున్న వారిని ఏజెంట్లుగా పెట్టాలి? అనే విషయాన్ని కూడా వారినే అడుగుతున్నారు. గెలుపునకు ఓటర్ల మనస్సులో స్థానం సంపాదించాల్సిన వీరు పూజారులను నమ్ముతుండడంతో సమాజానికి పంపిస్తున్న సందేశమేంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

-------------

Updated Date - Oct 29 , 2026 | 12:13 AM