సమస్యలు పరిష్కరించండమ్మా..
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:42 AM
తమ సమస్యలు పరిష్కరించాలని ఇన్‌చార్జి జేసీ వైశాలిని ట్రాన్స్ జెండర్స్ ప్రెసిడెంట్ అడ్డాకుల గీతారాణి కోరారు.
జియ్యమ్మవలస, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని ఇన్‌చార్జి జేసీ వైశాలిని ట్రాన్స్ జెండర్స్ ప్రెసిడెంట్ అడ్డాకుల గీతారాణి కోరారు. బుధవారం టీకే జమ్ము పంచాయతీ కేంద్రంలో పర్యటించిన ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా కురుపాం పంచాయతీ టేకరకండి సమీపంలో ప్రభుత్వం ఏడు సెంట్లు స్థలం ఇచ్చారని, అక్కడ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడంతో పాటు పట్టా ఇవ్వాలని కోరారు. అలాగే ఇండివిడ్యువల్ రేషన్ కార్డులు మంజూరు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ట్రైకార్ రుణాల మంజూరు, జీవనోపాధికి చేతివృత్తులను ప్రోత్సాహించాలన్నారు. నిరు ద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, హెచ్‌ఐవీ పేషెంట్లకు న్యూట్రీషన్ ఫుడ్ అందివ్వాలన్నారు. అలాగే అల్లికలు, టైలరింగ్, పుట్ట గొడుగుల తయారీలో శిక్షణ ఇవ్వాలని కోరారు. అందుకు జేసీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.