‘పారదర్శకంగా సర్ చేపట్టండి’
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:32 AM
ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్ సీహెచ్.రాధాకృష్ణ మూర్తి ఆదేశించారు.
పాలకొండ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)ను పారదర్శకంగా చేపట్టాలని తహసీల్దార్ సీహెచ్.రాధాకృష్ణ మూర్తి ఆదేశించారు. బుధవారం ఆయన నగర పంచాయతీలో సర్ ప్రక్రియను కమిషనర్ నూకరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులు, పేరు, చిరునామా మార్పులు, ఒకే వ్యక్తికి డూప్లికేట్ నమోదులు, మృతి చెందిన ఓటర్ల పేర్లు, అర్హత కలిగిన నమోదులు వంటి అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఎల్‌వోలు పాల్గొన్నారు.