Share News

సమస్యలు ఉంటే తెలియజేయండి

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:31 AM

విజయనగరం పట్టణంలోని ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ బాలుర వసతిగృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి డా.ఎ.కృష్ణప్రసాద్‌ గురువారం తనిఖీ చేశారు.

సమస్యలు ఉంటే తెలియజేయండి

  • డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కృష్ణప్రసాద్‌

  • వసతిగృహాల తనిఖీ

విజయనగరం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): విజయనగరం పట్టణంలోని ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ బాలుర వసతిగృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి డా.ఎ.కృష్ణప్రసాద్‌ గురువారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజ నం, తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లా డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం, హక్కు ల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - Nov 13 , 2026 | 12:31 AM