Share News

Playing with Public Health! ప్రజారోగ్యంతో చెలగాటం!

ABN , Publish Date - May 03 , 2026 | 12:08 AM

Playing with Public Health! గుమ్మలక్ష్మీపురంలో పలువురు వ్యాపారులు గడువు ముగిసిన సరుకులను విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల తనిఖీల్లో ఇది బహిర్గతమైంది.

Playing with Public Health! ప్రజారోగ్యంతో చెలగాటం!
షాపులో తనిఖీలు చేస్తున్న అధికారులు

  • పలు షాపుల్లో గడువు ముగిసిన సరుకుల గుర్తింపు

గుమ్మలక్ష్మీపురం, మే2(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురంలో పలువురు వ్యాపారులు గడువు ముగిసిన సరుకులను విక్రయిస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల తనిఖీల్లో ఇది బహిర్గతమైంది. శనివారం ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ప్రభాకర్‌, తహసీల్దార్‌ శేఖర్‌, ఆర్‌ఐ శివ తదితరులు మండలకేంద్రంలో సుమారు పది షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శీతలపానియాలు, తినుబండారాలతో పాటు వివిధ సరుకుల ఎక్స్‌పైర్‌ డేట్‌ ముగిసినా విక్రయానికి ఉంచినట్లు గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని.. సదరు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - May 03 , 2026 | 12:08 AM