Share News

ప్లాస్టిక్‌ రహితంగా గ్రామాలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:07 AM

బొబ్బిలి మం డల పరిషత్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయిలో ఎంపీడీవోల తో డీడీవో ఎం.కిరణ్‌కుమార్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ప్లాస్టిక్‌ రహితంగా గ్రామాలు

  • డీడీవో కిరణ్‌కుమార్‌

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మం డల పరిషత్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయిలో ఎంపీడీవోల తో డీడీవో ఎం.కిరణ్‌కుమార్‌ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం పలు జిల్లాల్లో స్వచ్ఛ రథాలను ప్రాంభించనుందని తెలిపారు. ఈ వాహనాల ద్వారా ప్లాస్టిక్‌ వస్తువులు సహా ఐరన్‌, అట్టపెట్టెలు ఇతర పనికిరాని వస్తువులను తీసుకుని.. దానికి బదులుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. అలాగే ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. డివిజన్‌ పరిధిలోని 7 మండలాల్లో ఇంటి పన్నుల వసూళ్లు మందకొడిగా ఉన్నాయని, మరో 2 రోజుల్లోగా ఎంపీడీవో, కార్యదర్శులు, వసూళ్లను శతశాతం సాధించేలా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వ్యవహరించిన 32మంది అధికార సిబ్బందికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఈ సమావేశంలో బొబ్బిలి ఎంపీడీవో పి.రవికుమార్‌, బాడంగి, తెర్లాం, రామభద్రపురం ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 12:07 AM