15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:17 AM
స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాం సుందర్‌రెడ్డి తెలిపారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
చీపురుపల్లి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాం సుందర్‌రెడ్డి తెలిపారు. రావివలసలో శనివారం జరిగిన ప్రజావేదికలో ఆయన మాట్లా డారు. జిల్లాలో ఉద్యానవన సాగు విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్ర మల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2025-26 సంవ్సరానికి 3,280 ఎకరా ల్లో ఉద్యానవన సాగు అదనంగా తీసుకువచ్చామని చెప్పారు. ఈ రబీలో మరో 4వేల ఎకరాలను సాగులోకి తీసుకొని వస్తామన్నారు. రాబోయే ఖరీఫ్‌లో మరో 6వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగయ్యేలా ప్రణాళికలు తయారు చేశామని తెలిపారు. ఎకనా మిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా ఫుడ్ పార్క్స్, టాయ్ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, ఐటీ పార్కుల కోసం భూములు గుర్తించామన్నారు. నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పార్కులో భాగంగా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో భూములు కేటాయించామని చెప్పారు. జిల్లాలో 2 లక్షల 72వేల మందికి ప్రతి నెలా రూ.115.63 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.