Share News

ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:07 AM

ప్రధాని పర్యటనలో భాగం గా నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని పురపాలకశాఖ మంత్రి నారాయణ కోరారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక
గోవా గవర్నర్‌ అశోక్‌ను కలిసిన మంత్రులు నారాయణ తదితరులు:

విజయనగరం కంటోన్మెంట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ప్రధాని పర్యటనలో భాగం గా నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని పురపాలకశాఖ మంత్రి నారాయణ కోరారు. బుధవారం విజయనగరంలోని గోవాగవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజుని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జి ఆరిమిల్లి రాధాకృష్ట, పార్టీ పరిశీలకులు కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్యాంపుకార్యాలయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులు, పరిశీల కులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునతో సమీక్షించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి పనులకోసం విజయనగరం నగరపాలక సంస్థకు వీఎంఆర్డీఏ నుంచి రూ.21 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు.

Updated Date - Jul 30 , 2026 | 12:07 AM