సమస్యల పరిష్కారానికి ప్రణాళిక: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:13 AM
‘ప్రజాదర్బార్’లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు.
విజయనగరం రూరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజాదర్బార్’లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆ ప్రణాళిక ప్రకారం స్వల్పకాలిక, దీర్ఘకాలిక, ఆర్థికపరమైనవిగా విభజించి.. ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో విజయనగరం మండల పరిధిలోని గ్రామాలు, నగర పరిధిలోని వివిధ డివిజన్ల నుంచి ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టికి తీసుకువచ్చారు. వీటి పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఆమె చెప్పారు. ముఖ్యంగా రోడ్లు, కాలువలు, లైటింగ్‌తో పాటు, పింఛన్లు, ఇళ్లు, ఇంటి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు వినతులు సమర్పించారు.
జీఎస్టీని రద్దు చేయండి
విజయనగరం దా సన్నపేట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ అధికారులు షాపులపై వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీని రద్దు చేయాలని వర్తకుల సంఘ అధ్యక్షుడు బెహరా శంకరరావు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పీవీ రమణ, డి.సన్యాసిరావు, ఎస్.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.