గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:21 AM
గ్రామాల్లో తాగు, సాగునీరందించడంతో పాటు అవసరమైన తారురోడ్లు నిర్మించి పట్టణాలను తలపించే విధంగా గ్రామాలను అభి వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.
చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు
గరివిడి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో తాగు, సాగునీరందించడంతో పాటు అవసరమైన తారురోడ్లు నిర్మించి పట్టణాలను తలపించే విధంగా గ్రామాలను అభి వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. బుధవారం మండలంలో తాడిగూడ, సేరీపేట, ఏనుగువలస, విపిరేగ గ్రామాల్లో రూ.4.90 కోట్లతో తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, టీడీపీ నేతలు పైల బలరాం, సారిపాక సురేష్‌కుమార్ పాల్గొన్నారు.