Share News

పైనాపిల్‌ ధర పతనం

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:49 PM

సీతంపేట ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో పైనాపిల్‌ ధర ఒక్కసారిగా పతనమైంది.

పైనాపిల్‌ ధర పతనం
వ్యాపారులు కొనుగోలు చేసిన పంటను వాహనంలో లోడ్‌ చేస్తున్న గిరిజన రైతులు

- ఒక పండు రూ.10

సీతంపేటరూరల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి):సీతంపేట ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో పైనాపిల్‌ ధర ఒక్కసారిగా పతనమైంది. సీతంపేట వారపుసంతకు ఆదివారం గిరిజన రైతులు పెద్దఎత్తున పైనాపిల్‌ పంటను తీసుకువచ్చారు. మన్యంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో రైతులు తీసుకువచ్చిన పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకలేదు. దీంతో చేసేది లేక రైతులు పైనాపిల్‌ పండ్లను తక్కువ ధరకు అమ్మేశారు. ఇదే అదునుగా వ్యాపారులు ఒక్కో పైనాపిల్‌ పండును కారుచౌకగా రూ.10కి కొనుగోలు చేశారు. శనివారం పైనాపిల్‌ పండు ధర రూ.16పైనే పలకగా, ఆదివారానికి ధర తగ్గి రూ.10కే అమ్ముడుపోయింది. వ్యాపారులందరూ సిండికేట్‌గా మారి గిరిజన రైతుల నుంచి అతితక్కువ ధరకు పైనాపిల్‌ ను కొనుగోలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఈ పైనాపిల్‌ పండు ధర రూ.25కిపైగానే పలుకుతోంది.

Updated Date - Jun 21 , 2026 | 11:49 PM