పూలే ఆశయాలను భావితరాలకు తెలియజేయాలి
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:29 PM
: పూలే ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి
విజయనగరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పూలే ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమీపంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే విధానాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. కలెక్టర్ రాముసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో పాతుకుపోయిన సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు పూలే అవిరాళమైన కృషి చేశారన్నారు. మహిళలు, వితంతువులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. బాలికలు, మహిళల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆలోచనతో, సమాజానికి ఉన్నత ఆశయాలు అందించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అన్నారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జ్యోతి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.