Share News

They’re Safe! హమ్మయ్యా.. క్షేమమేనట!

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:23 AM

Phew.. They’re Safe! నేపాల్‌ వరదల్లో పార్వతీపురానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం కొట్టుకుపోలేదని సమచారం రావడంతో పట్టణంలో వారి దూరపు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబాయిలో ఉంటున్న సంతోష్‌కుమార్‌ సాహు మామతో పాటు దక్షిణాఫ్రికాలోలో ఉంటున్న సోదరుడు మురళీ సాహు ఫోన్‌లో చెప్పడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 They’re Safe! హమ్మయ్యా.. క్షేమమేనట!
వరదలకు ముందు నేపాల్‌లో సంతోష్‌ సాహు కుటుంబం

  • వరదలకు రెండు గంటల ముందే నేపాల్‌ నుంచి వెళ్లిపోయారు

  • ఫోన్‌ ద్వారా ట్రావెల్‌ వాహనం డ్రైవర్‌ తెలిపినట్లు సోదరుడు, మామ వెల్లడి

  • స్థానిక బంధువుల్లో ఆనందం

పార్వతీపురం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నేపాల్‌ వరదల్లో పార్వతీపురానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం కొట్టుకుపోలేదని సమచారం రావడంతో పట్టణంలో వారి దూరపు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు శనివారం ముంబాయిలో ఉంటున్న సంతోష్‌కుమార్‌ సాహు మామతో పాటు దక్షిణాఫ్రికాలోలో ఉంటున్న సోదరుడు మురళీ సాహు ఫోన్‌లో చెప్పడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

లండన్‌లో స్థిరపడిన పార్వతీపురం పట్టణం పండావీధికి చెందిన చెందిన సంతోష్‌కుమార్‌ సాహు (47).. , ఆయన భార్య సురభిపాడి (43), కుమారుడు స్పందన సాహు (14), కుమార్తె సైనాకుమారి సాహు (13) కొద్దిరోజుల కిందట ఇండియాకు వచ్చారు. ట్రావెల్‌ కంపెనీ సాయంతో వివాహారయాత్ర కోసం మానస సరోవరం వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా ఈనెల 26న నేపాల్‌లో వరదలు సంభవించడానికి ముందు రెండు గంటల ముందే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని ట్రావెల్‌ వాహనం డ్రైవర్‌ ఫోన్‌ ద్వారా చెప్పినట్లు సంతోష్‌కుమార్‌ సాహు మామ, సోదరుడు తమకు చెప్పారని స్థానిక బంధువులు, ఆత్మీయులు చెబుతున్నారు. వరదల్లో కొట్టుకుపోయినట్లు ఢిల్లీ పోలీసులు, నేపాల్‌ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కూడా ధ్రువీకరించ లేదని వారు తెలిపారు. సోమవారం నాటికి పూర్తి సమాచారం అందిస్తామని నేపాల్‌ అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. మొత్తంగా సంతోష్‌కుమార్‌ సాహు కుటుంబం క్షేమంగా ఉన్నట్లు బంధువులు భావిస్తున్నారు. త్వరలోనే వారు ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంతోష్‌కుమార్‌ సాహు తండ్రి సుభాష్‌ చంద్ర సాహు పార్వతీపురంలోనే ఫారెస్ట్‌ అధికారిగా పనిచేసేవారు 15 ఏళ్ల కిందట రిటైర్‌ అయ్యారు. ఆయన భార్య సుమారు రెండేళ్ల కిందట మృతి చెందారు. వారి ముగ్గురు తనయుల్లో పెద్ద కుమారుడు సంతోష్‌కుమార్‌ సాహు. ఆయన పదో తరగతి వరకు పట్టణంలోనే విద్యభ్యసించారు. అనంతరం ఇంటర్‌, డిగ్రీ విశాఖలో పూర్తి చేసి లండన్‌ వెళ్లిపోయి స్థిరపడినట్టు బంధువులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సుభాష్‌ చంద్ర సాహు కూడా దక్షిణాఫ్రికాలో ఉంటున్న తన రెండో కుమారుడు మురళీసాహు వద్ద ఉంటు న్నారు. మూడో కుమారుడు కలియ సాహు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం పార్వతీ పురంలో ఆ కుటుంబ సభ్యులు ఎవరూలేరు.

Updated Date - Aug 30 , 2026 | 12:23 AM