Share News

చికిత్స పొందుతూ ఫార్మా ఉద్యోగి మృతి

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:02 AM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫార్మా ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

చికిత్స పొందుతూ ఫార్మా ఉద్యోగి మృతి

పరవాడ, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫార్మా ఉద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఫార్మాసిటీలో ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న శిరపురపు ధనుంజయరావు(37) ఈనెల 18న బి-షిఫ్ట్‌ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. లంకెలపాలెం బ్రిడ్జి ఎక్కుతుండగా వాహనం అదుపుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అగనంపూడి వద్ద గల ఫార్మాసిటీ కాలనీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. మృతుని తండ్రి అర్జున్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 12:02 AM