Share News

పీజీఆర్‌ఎస్‌ వినతులను గడువులోగా పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:10 AM

పీజీఆర్‌ఎస్‌ వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌ వినతులను గడువులోగా పరిష్కరించాలి

విజయనగరం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌ వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ వినతులను రెండు పూటలా లాగిన్‌లో తనిఖీ చేయాలని, రెవెన్యూ పిటిష న్లకు సంబంధించి తహసీల్దార్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. వినతులకు సంబంధం లేని అనవసరమైన సమాధానాలు ఇవ్వకూడదన్నారు. ఐవీ ఆర్‌ఎస్‌లో తమ శాఖలకు సంబంధించి ప్రజాభిప్రా యంపై పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావాలని, ఆయా శాఖలు వారు తమ పనితీరును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పథకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. అధికారులు నెలకు నాలుగు సచివా లయాలను సందర్శించాలని తెలిపారు. ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతం చేయాల ని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, డీఆర్వో మురళి, సీపీవో బాలాజీ పాల్గొన్నారు.

రెవెన్యూ సమస్యలపై అధిక వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ ఎస్‌లో రెవెన్యూ సమస్యలపై అధికంగా వినతులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌తో పాటు రెవెన్యూ క్లినిక్‌లో కూడా భూ సమస్యలు వచ్చాయి. వీటిని డీఆర్వో మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వినతుల స్వీకరించా రు. ప్రతి వినతిని పరిశీలించి.. సంబంధిత శాఖా ధికారులకు పరిష్కారం కోసం పంపించారు. వెంట వెంటనే వినతులు పరిష్కరించాలని సూచించారు.

Updated Date - Feb 24 , 2026 | 12:10 AM