Share News

పీజీఆర్‌ఎస్‌కు స్పందన కరువు

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:37 AM

సీతంపేట ఐటీడీఏలో సోమ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు గిరిజనుల నుంచి స్పందన కరువుతోంది.

పీజీఆర్‌ఎస్‌కు స్పందన కరువు
మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌

సీతంపేట రూరల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో సోమ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు గిరిజనుల నుంచి స్పందన కరువుతోంది. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ హాజరై 9 వినతులను స్వీకరించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 12.30 గంటలకే ముగించారు. పీజీఆర్‌ఎస్‌లో ఏపీవో చిన్నబాబు, పీహెచ్‌వో ఆర్‌వీ గణేష్‌, డిప్యూటీ ఈవో పి.నారాయడు, టిడబ్ల్యూ ఈఈ రమాదేవి, ఏవో వాహిని తదితరులు పాల్గొన్నారు. అయితే పీజీఆర్‌ఎస్‌కు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఎప్పుడు అందుబాటులో ఉంటారో లేదో తెలియక గిరిజనులు వినతులు అందజేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీనిపై ఐటీడీఏ ఏపీవో చిన్నబాబును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఐటీడీఏలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు పీవో అందుబాటులో లేకపోయినప్పటికీ శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అందుబాటులో ఉంటున్నారన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:37 AM