పెట్రోల్ ధరలు తగ్గించాలి
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:02 AM
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీఐ టీయూ నాయకుడు కొల్లి సాంబమూర్తి కోరారు. శనివారం మండలంలోని కూనేరు సంతలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు.
కొమరాడ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీఐ టీయూ నాయకుడు కొల్లి సాంబమూర్తి కోరారు. శనివారం మండలంలోని కూనేరు సంతలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. ఈసందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం ఇప్పటికే నాలుగుసార్లు ధరలు పెంచి ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసిం దని ఆరోపించారు పెరిగిన గ్యాస్ ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడు తున్నారని వాపోయారు. దీనిపై ఈనెల తొమ్మిదో తేదీన కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.