పింఛన్లు కోరుతూ అర్జీలు
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:59 PM
పింఛన్లు కావాలని కోరుతూ ఎస్.కోట నియోజకవర్గం నుంచి 35 మంది అర్జీలు ఇచ్చారని ఎమ్మెల్యే లలితకుమారి తెలి పారు.
లక్కవరపుకోట, జూలై 17(ఆంధ్రజ్యోతి): పింఛన్లు కావాలని కోరుతూ ఎస్.కోట నియోజకవర్గం నుంచి 35 మంది అర్జీలు ఇచ్చారని ఎమ్మెల్యే లలితకుమారి తెలి పారు. శుక్రవారం ఎల్.కోటలోని తన క్యాంపు కార్యాల యం వద్ద ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. రేగ గ్రామానికి చెందిన పలువురు మ హిళలు పింఛన్లు కావాలంటూ అర్జీలు సమర్పించారు. అర్హులైన వారంద రికీ త్వరలోనే ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రెవెన్యూ, హౌసింగ్, ఆరోగ్య శాఖలకు సంబంధించిన వినతులు కూడా వచ్చినట్టు తెలిపారు. కొత్తవలస ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, మాజీ సర్పంచ్‌లు భూపాల్‌నాయుడు, యడ్ల ఈశ్వరరావు పాల్గొన్నారు.