Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:17 AM

సారిపల్లి పారిశ్రామికవాడలోని ఒక కంపెనీ లో రేకులషెడ్డు వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిన ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నెల్లిమర్ల, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): సారిపల్లి పారిశ్రామికవాడలోని ఒక కంపెనీ లో రేకులషెడ్డు వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిన ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. విజయనగరం నీలట్యాంకు ప్రాంతానికి చెందిన బి.శ్రీరాములు(42) ఈనెల 9న కంపెనీలో రేకుల షెడ్డు వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అతనిపైన రేకులు పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని విజయనగరంలోని ఆసుపత్రికి తర లించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచె ందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Jun 14 , 2026 | 12:17 AM