చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:16 AM
మండలంలోని తారాపురం సమీ పంలో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొం దుతూ శనివారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు తెలిపారు.
రామభద్రపురం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని తారాపురం సమీ పంలో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొం దుతూ శనివారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు తెలిపారు. సాలూరు మండలంలోని పురోహితునివలస గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాసరావు(46) నడుచుకొని రామభద్రపురం వైపు వస్తుండగా.. పాచిపెంట నుంచి బైకుపై వస్తున్న వ్యక్తులు ఢీకొన్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన శ్రీని వాసరావును ప్రఽథమ చికిత్సకు సాలూరు, అక్కడి నుంచి విజయనగరం, తరు వాత విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.