Permissions should be granted quickly. త్వరత్వరగా అనుమతులివ్వాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:38 PM
Permissions should be granted quickly. జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు వచ్చిన దరఖాస్తులకు గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది.
త్వరత్వరగా అనుమతులివ్వాలి
గడువులోగా పరిశ్రమల దరఖాస్తులకు పరిష్కారం
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమలను స్థాపించేందుకు వచ్చిన దరఖాస్తులకు గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ సింగిల్ డెస్క్ పాలసీ కింద అందిన దరఖాస్తులపై సమీక్షించారు. మార్చి నుంచి జూన్ 772 దరఖాస్తులు అందగా 752 దరఖాస్తులను ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలన్నారు.
రైతులు అఽధిక ఆదాయం పొందేందుకు ప్రధానమంత్రి -సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఉద్యాన, మెప్మా అధికారులతో ఆయన శనివారం సమీక్షించారు. ఈ పథకం ద్వారా 10 శాతం అర్జీదారుడు పెట్టుబడి పెడితే మిగిలిన 90 శాతం బ్యాంకు రుణ సదుపాయం ఉంటుందన్నారు. రూ.10 లక్షలు ప్రాజెక్టు విలువలో 35 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగిన కనీస విద్యార్హత ఉండే వ్యక్తులు, సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టరు తెలిపారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 547 యూనిట్లు మంజూరయ్యాయని, అందులో 503 యూనిట్లకు రూ.223 కోట్ల రుణం మంజూరైందని చెప్పారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ చిట్టిబాబు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి తదితరులు పాల్గొన్నారు.