Share News

రైతులకు శాశ్వత భూహక్కులు

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:30 AM

రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు

రైతులకు శాశ్వత భూహక్కులు
పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బాడంగి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలతో శాశ్వత భూ హక్కులు కల్పించామని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడుతో కలిసి ఆయన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన కొతల ఆధారంగా నిర్వహించిన రీసర్వే వల్ల భూముల సరిహద్దులపై ఉన్న వివాదాలు, సందిగ్ధతలు తొలగిపోవడంతో పాటు రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహనరావు, తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీడీవో శ్రీలత, ఎలక్షన్‌ డీటీ గౌరీశంకర్‌, ఎంపీపీ యజ్జల లక్ష్మి, వైస్‌ ఎంపీపీ పాలవలస గౌరు, సింగిరెడ్డి భాస్కరరావు, పార్టీ ప్రెసిడెంట్‌ తెంటు రవిబాబు, జడ్పీటీసీ సభ్యుడు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:31 AM