పనితీరు మెరుగు పరుచుకోవాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:22 AM
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పనితీరు ను మెరుగుపరుచుకుని, నిర్దేశిత గడువులోగా లక్ష్యలను పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి ఆదేశించారు.
జిల్లా ఎన్నికల అధికారి రామసుందర్‌రెడ్డి
రాజాం, జూలై 13(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పనితీరు ను మెరుగుపరుచుకుని, నిర్దేశిత గడువులోగా లక్ష్యలను పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో సర్వేలో వెనుక బడిన సూపర్‌వైజర్లతో ఆయన సమీక్షించారు. ఇంటింటి సర్వే, డిజిటలైజేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి అంశంలోనూ వేగం పెంచి నాణ్య తతో పనులు పూర్తిచేయాలని సూచించారు. నిర్దేశిత కాల పట్టికను పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవ రణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సోమవారం సాయంత్రంలోగా బీఎల్వోలతో ‘సర్’ కార్యక్రమం పూర్తిచేయించేలా సూపర్‌వైజర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్‌వో ఇ.వెంకటరెడ్డి, తహసీల్దార్ ఎం.రాజవేఖర్, కమిషనర్ ఎ.రామచంద్రరావు, ఎంపీడీవో జె.ఆనందరావు, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ వి.జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.