‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:26 AM
వంశధారలో నీటి ప్రవాహం అధికమైన నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ హెచ్చరించారు.
భామిని, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వంశధారలో నీటి ప్రవాహం అధికమైన నేపథ్యంలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ హెచ్చరించారు. గురువారం బత్తిలి వద్ద నదీ ఉధృతిని ఆయన పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎం.నాగేంద్రప్రసాద్, వ్యవసాయాధికారి షేక్ అఫ్రీన్, బత్తిలి ఎస్‌ఐ రవీంద్ర, ఆర్‌ఐ పి.మణిప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.