Share News

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

ABN , Publish Date - May 28 , 2026 | 12:44 AM

పోలీ సులు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిం చాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించా లని విజయనగరం ఎస్పీ దామోదర్‌ కోరారు.

 ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

విజయనగరం, మే 27(ఆంధ్రజ్యోతి): పోలీ సులు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిం చాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించా లని విజయనగరం ఎస్పీ దామోదర్‌ కోరారు. బుధవా రం రాత్రి విజయనగరం లోని ప్రధాన కూడళ్లల్లో బక్రీద్‌ పురస్కరించుకుని తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్లు, రాత్రివేళల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీసీ కెమె రా పర్యవేక్షణ, చెక్‌పోస్టు పనితీరు, వాహనాల తనిఖీలు, గస్తీని ముమ్మరం చేశారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. బక్రీద్‌ సమయంలో శాంతిభద్రతలు అత్యంత కీలకమని, ప్రజలు భయాందోళలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణా, గోవధ జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఐలు ఆర్‌వీఆర్‌కే చౌదరి, టి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:44 AM