Anti-People Policies ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:36 PM
People Must Reject Anti-People Policies కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కిసాన్, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వద్ద ధర్నా చేశారు.
పార్వతీపురం టౌన్, ఆగస్టు 10 (ఆంఽధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కిసాన్, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాలకులు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతులను భూములకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఎరువు, పురుగుల మందుల ధరలను పెంచి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నారన్నారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, పంటల ఉత్పత్తి ఖర్చులపై అదనంగా 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులకు గుర్తింపుకార్డులు ఇచ్చి సకాలంలో బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర సర్కారు విధానాలకు నిరసనగా ర్యాలీలు, జైల్‌భరో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.