ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:31 AM
ముంపు ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. గురువారం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే భారీ వర్షాలపై మండల కేంద్రాల్లో సమీక్షించారు.
ముంపు ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. గురువారం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే భారీ వర్షాలపై మండల కేంద్రాల్లో సమీక్షించారు.
ఫబెలగాం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వరహాల గెడ్డలో పెరిగిన నీటి ప్రవాహ ఉధృతిని ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశిం చారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బందిని అప్రమ త్తంగా ఉంచాలని, నీటి ప్రవాహ ప్రాంతాలకు పిల్లలు, వృద్ధులు, మహిళలు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రహదారులపై విరిగి పడిన చెట్లను సిబ్బందితో తొలగించి రాకపోకలను పునరుద్దరిస్తున్నట్టు తెలి పారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ సీఐ బి.రమణమూర్తి, పట్టణ సీఐ బి.వెంకట రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫసాలూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంతోపాటు మండలం లో ఎడతెరపి కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎం.సురేష్ కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మునిసిపల్ ఇన్‌చార్జి కమిషనర్ ప్రసాదరావు, ఎంపీడీవో పార్వతి, రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజుతోపాటు పలువురు అధికారులతో అత్యవసర సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం కురుస్తు న్న వర్షాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగాఉండాలని సూచించారు. ప్రధానంగా లోత ట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఇప్పటికే పట్టణంతోపాటు మండలంలో ఉన్న అన్ని చెరువులు కూడా నిండుకుండలా దర్శనమిస్తున్నాయని తెలిపారు. చెరువుల సమీపంలో ఉన్నవారు, కాలువల పక్కన ఉన్నవారిపై కూడా దృష్టిసారించాలని కోరారు.
ఫబెలగాం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణంలో భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కూటమి నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బైపాస్ కాలనీలోని ఎస్సీ బాలుర వసతిగృహంలోకి చేరిన వరదనీటితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు బిస్కెట్లు, చాపలు అందజేశారు. కార్య క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు కోల మధు, మజ్జి వెంకటేష్, గణేష్ పాల్గొన్నారు.
ఫకురుపాం, సెప్టెంబరు24(ఆంధ్రజ్యోతి): తుఫాన్ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయి కృష్ణ చైతన్య కోరా రు. కురుపాంలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలంలో జరిగిన పంట, ఇళ్ల నష్టం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయంపై వివరాలు సేకరించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఆర్.వేణుగోపాల్, ఏవో విజయకుమార్, ఈఓ వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫపార్వతీపురం రూరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాకిగెడ్డ ప్రాంతంలో మండల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా చాకిగెడ్డవైపు ప్రజలు వెళ్లవ ద్దని ప్రమాదకర పరిస్థితుల్లో గడ్డ ప్రవహించడం వల్ల అటువైపు ప్రజలు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఫగరుగుబిల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రావుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ముంపునకు గురైన వరి పంటలను జిల్లా వ్యవసాయా ధికారి టి.భవానిశంకర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ అధికంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దిగువకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఏటా దేసూరిగెడ్డ వరద వల్ల 500 ఎకరాలకు పైబడి పంట ముంపునకు గురవుతుందని, దీంతో నష్టపోతున్నా మని రైతులు జిల్లా అధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గెడ్డ పరిధిలో పూడికలు, పిచ్చి మొక్కలు తొలగింపునకు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏవో టి.జ్యోత్స్న, మాజీ సర్పంచ్ బి.మహేశ్వరావు, బి.సత్యనా రాయణ, జి.లక్ష్ముంనాయుడులు పాల్గొన్నారు.
ఫవీరఘట్టం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నడుకూరు, కిమ్మి గ్రామాల మధ్య వరదలకు దెబ్బతిన్న రహదారిపై పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో బి.వెంకటరమణ, ఎస్‌ఐ షన్ముఖరావు పరిశీలిం చి వాహనాలు రాకపోకలకు నియంత్రించారు. రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఫసీతానగరం (బలిజిపేట), సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలంలోని పెదపెంకిలో తుఫాన్ ప్రభావంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు టీడీపీ నాయకుడు పెంకి వేణుగోపాలనాయుడు బియ్యాన్ని పంపిణీచేశారు.