Share News

losing their lives చచ్చిపోతున్నారు

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM

People are losing their lives. గిరిజన ప్రాంతాల్లో మహిళలు వరుసగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. అనారోగ్యం, నాటు వైద్యం, ఇతరత్రా సమస్యలతో ఇటీవల మండలంలో పలువురు మత్యువాత పడుతుండడం గిరిజనులను కలవరపరుస్తోంది. పాచిపెంట మండలం బొర్రమామిడికి చెందిన కొర్రా లక్ష్మి ప్రసవించిన నెలరోజుల్లోనే మరణించిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యంతో మరో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  losing their lives  చచ్చిపోతున్నారు

  • ప్రసవమైన తర్వాతే విషమిస్తున్న ఆరోగ్యం

పాచిపెంట రూరల్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో మహిళలు వరుసగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. అనారోగ్యం, నాటు వైద్యం, ఇతరత్రా సమస్యలతో ఇటీవల మండలంలో పలువురు మత్యువాత పడుతుండడం గిరిజనులను కలవరపరుస్తోంది. పాచిపెంట మండలం బొర్రమామిడికి చెందిన కొర్రా లక్ష్మి ప్రసవించిన నెలరోజుల్లోనే మరణించిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యంతో మరో ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

అరకు మండలం జారుమానుగూడకు చెందిన పోయి రంభ (25)కు గొట్టూరు పంచాయతీ పరిధి మూలపాడు గిరిజన గ్రామానికి చెందిన సోములతో మూడేళ్ల కిందట వివాహమైంది. కాగా ఈ ఏడాది మార్చి21న గురువునాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ ప్రసవమే కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందించారు. అయితే సుమారు ఏడు నెలల తర్వాత ఆమె అనారోగ్యం పాలైంది. గత 15 రోజులుగా రంభ ఆరోగ్యం మరింత క్షీణించింది. సాలూరులో ఓ ప్రైవేటు ఆసుప్రతిలో వైద్యం పొందింది. ఆ తర్వాత నాటు మందులు వినియోగించినట్లు తెలిసింది. అయితే పరిస్థితి మెరుగుపడలేదు. కాళ్లు, చేతులు ముఖం వాపులు, నొప్పులతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. తల్లిలేని బిడ్డ చూసి వారంతా కన్నీరుమున్నీరవుతున్నారు.

చికిత్స పొందుతూ బాలింత..

కేరంగి పంచాయతీ దొరలద్దండి గిరి శిఖర గ్రామానికి చెందిన పాడి సీతమ్మ (41) నాలుగో ప్రసవం కోసం గత నెల 25న గురువు నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరిస్థితి బాగోలేకపోవడంతో సాలూరు ఏరియా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ వైద్యలు పరీక్షించి ఆమెకు సిజేరియన్‌ చేశారు. మగబిడ్డ పుట్టినా దక్కలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సెప్టెంబరు 30న విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీతమ్మ మృతి చెందారని గురువునాయుడుపేట వైద్యాధికారి సురేష్‌ చంద్రదేవ్‌ తెలిపారు. మొత్తంగా గిరిజన గ్రామాల్లో వరుస మరణాలపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:20 AM