అర్హులందరికీ పింఛన్లు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:19 AM
అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబరు నుంచి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరుచేస్తామని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
కొమరాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబరు నుంచి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరుచేస్తామని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. గురువారం దళాయిపేట, కోదులగుంపల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖర్‌పాత్రుడు, నంగిరెడ్డి మధుసూదనరావు, గొట్టాపు త్రినాఽథం, ఉపేంద్ర, రాఘవ, బలరాం, విద్యాసాగర్, శంకర్‌రరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.