‘పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి’
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:01 AM
విజయనగరంలోని సాంస్కృత ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల మూ ల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో పిలు పుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని సాంస్కృత ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల మూ ల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో పిలు పుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఫ్యాప్టో చైర్మన్ పాల్తేరు శ్రీనివాసరావు అధ్యక్షతన దశలవారీ ఉద్యమ కార్యచరణను విజయవంతం చేయాలని కోరారు. చైర్మ న్ పాల్తేరు శ్రీనివాసరావు మాట్లాడుతూ 6వ తేదీ పీఎ స్సార్ పాఠశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన, 9న పీఎ స్సార్ స్కూల్‌లోని మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన, 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే దీక్షలు చేపడతామని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యా యులు, ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధు లు సీహెచ్ భాస్కరరావు, డి.శ్యామ్, శివప్రసాద్, పైడి రాజు, సూర్యనారాయణ, శ్రీనివాసరావు, అప్పారావు, వెంకట రమణ, సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.