Share News

Peacefully Pauliset ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:39 PM

Peacefully Pauliset జిల్లాలో పాలిసెట్‌ ప్రశాంతంగా జరిగింది. 26 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 8054 మంది హాజరుకావాల్సి ఉండగా 7,222 మంది రాశారు. 832 మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరిగింది.

Peacefully Pauliset ప్రశాంతంగా పాలిసెట్‌
పట్టణంలో ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు

ప్రశాంతంగా పాలిసెట్‌

7222 మంది అభ్యర్థులు హాజరు

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాలిసెట్‌ ప్రశాంతంగా జరిగింది. 26 కేంద్రాల్లో శనివారం నిర్వహించిన పరీక్షకు 8054 మంది హాజరుకావాల్సి ఉండగా 7,222 మంది రాశారు. 832 మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరిగింది. అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు వచ్చారు. విజయనగరంలో 3593 మంది హాజరు కావాల్సి ఉండగా 3345(93 శాతం) మంది రాశారు. 248 మంది హాజరు కాలేదు. నెల్లిమర్లలో 243 మంది రాయాల్సి ఉండగా 234 హాజరయ్యారు. గజపతినగరంలో 1823 మంది రాయాల్సి ఉండగా 1493 మంది రాశారు. చీపురుపల్లిలో 1823 రాయాల్సి ఉండగా 1185 మంది హాజరయ్యారు. బొబ్బిలిలో 1112 మంది హాజరు కావాల్సి ఉండగా 965 మంది రాశారు. గజపతినగరం పరిధిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. పలు పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పోలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ డాక్టరు జి.సత్యనారాయణ తనిఖీ చేశారు.

Updated Date - Apr 25 , 2026 | 11:39 PM