Share News

Peacefully… ప్రశాంతంగా..

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:52 PM

Peacefully… ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు729 విద్యార్థులు హాజరయ్యారు. 61 మంది గైర్హాజరయ్యారు.

Peacefully…  ప్రశాంతంగా..
భామిని ఆదర్శ పాఠశాలలో పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు729 విద్యార్థులు హాజరయ్యారు. 61 మంది గైర్హాజరయ్యారు. కాగా జిల్లాలో సాలూరు మండలం పురోహితునివలస, మక్కువ మండలం ములక్కాయవలస, కురుపాం, భామిని మండలాల్లో ఆదర్శ పాఠశాలలున్నాయి. వాటిలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశపరీక్షను నిర్వహించారు. సాలూరు మండలం పురోహితునివలసలో 174 మందికి గాను 160 మంది , మక్కువ మండలం ములక్కా యవలసలో 128కి 121 మంది, కురుపాంలో 253 మందికి గాను 218 మంది , భామినిలో 235 మందికి గాను 230 మంది పరీక్షలు రాశారు. ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకుడు కె.ధర్మకుమార్‌ పరిశీలించారు. జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం విజయవాడకు తరలించారు. ఫలితాలు అనంతరం ప్రతిభ, రిజర్వేషన్లు ప్రాతిపదికగా సీట్లు కేటాయిస్తారు. కాగా టెన్త్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ అన్నా శ్యాముల్‌ తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 11:52 PM