Share News

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:17 AM

లింగాలవలస గ్రామం వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని, ఐదుగురిని అరెస్టు చేసి నట్టు విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామారావు తెలిపారు.

 పీడీఎస్‌ బియ్యం పట్టివేత

గజపతినగరం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): లింగాలవలస గ్రామం వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని, ఐదుగురిని అరెస్టు చేసి నట్టు విజిలెన్స్‌ ఎస్‌ఐ బి.రామారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రీజనల్‌ విజిలెన్స్‌ అధికారి కె.ప్రభాకరరావుకు ముందుగా సమాచారం అందడంతో, ఆయన ఆదేశాల మేరకు ఆ శాఖ సిబ్బంది గజపతినగరం నుంచి లింగాలవలస వైపు వెళ్తున్న ఆటోలను తనిఖీ చేశారు. మూడు ఆటోల్లో 21 క్విం టాల పీడీఎస్‌ బియ్యంతో పాటు రాగులు తరలిస్తున్నట్టు గుర్తించారు. పి.అప్పల నాయుడు, ఎ.రామకృష్ణ, ఆర్‌.భాస్కరరావు అనే ఆటో డ్రైవర్లతో పాటు ముప్పిడి గణేష్‌, నాని అనే నిందితులను పట్టుకుని, కేసు నమోదు చేశారు. బియ్యాన్ని లింగాలవలస డీలర్‌ లక్ష్మికి అప్పగించారు. ఆటోలను సీజ్‌ చేసి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ సిబ్బంది కామేశ్వరరావు, తిరుప తిరావు, కన్నబాబు, సీఎస్‌డీటీ చిరంజీవి పాల్గొన్నారు.

రాజాంలో..

రాజాం రూరల్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రాజాం-చీపురుపల్లి మార్గంలో అక్ర మంగా రవాణా చేస్తున్న సుమారు 5 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని శుక్రవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని రాజాం పొలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. సీఎస్‌ డిప్యుటీ తహసీల్దార్‌ అనంత్‌ సార ధ్యంలో రెవెన్యూ సిబ్బంది దాడులు నిర్వహించారు.

Updated Date - Jun 06 , 2026 | 12:17 AM