Share News

పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:57 PM

తాలాడ జంక్షన్‌ వద్ద శనివారం నిర్వహించి న తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1040 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నా మని సంతకవిటి ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు.

 పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

సంతకవిటి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): తాలాడ జంక్షన్‌ వద్ద శనివారం నిర్వహించి న తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1040 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నా మని సంతకవిటి ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు తాలాడ జంక్షన్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఒక వ్యానులో అక్రమంగా 23 బస్తా ల(1040 కిలోలు) పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించి.. స్వాధీనం చేసుకు న్నారు. బియ్యం విక్రేతగా పొందూరు మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అమరాన సురేష్‌, వాహన డ్రైవర్‌గా రాజాం మండలం రామానుజుపేట గ్రామాని కి చెందిన గుర్రాల కృష్ణారావును గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని సివిల్‌ సప్లయీస్‌ డీటీ అనంతకుమార్‌కు అప్ప గించా రు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించిన వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశా మని డీటీ చెప్పారు.

Updated Date - Jun 06 , 2026 | 11:57 PM