సాయి సుమంత్‌పై పీడీ యాక్టు
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:15 AM
విజయనగరం మం డలం చెల్లూరు గ్రామంలో నివాసం ఉంటున్న మీసాల సాయి సుమంత్‌పై గంజాయి కేసులో పీడీ యాక్టు ప్రయోగించి అదుపులోకి తీసుకుని, ఏడాది పాటు బెయిల్ మంజూరు కాకుండా విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ దామోదర్ తెలిపారు.
విజయనగరం దాసన్నపేట, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విజయనగరం మం డలం చెల్లూరు గ్రామంలో నివాసం ఉంటున్న మీసాల సాయి సుమంత్‌పై గంజాయి కేసులో పీడీ యాక్టు ప్రయోగించి అదుపులోకి తీసుకుని, ఏడాది పాటు బెయిల్ మంజూరు కాకుండా విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటకు చెందిన సాయి సుమంత్ ప్రస్తుతం విజయనగరంలో నివ శిస్తున్నాడు. ఈయన చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ గంజాయి రవాణా, విక్రయాలు వినియోగానికి పాల్పడుతున్నాడు. ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయా కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. విజయనగరం రూరల్ పీఎస్, వన్‌టౌన్ పీఎస్, బొండపల్లి పీఎస్‌లలో ఐదు గంజాయి కేసులు నమోదు అయ్యాయి. సమాజానికి ప్రమాదకరంగా తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, శాం తిభద్రతలకు విఘాతం కలిగించేలా మారుతున్నాడు. దీంతో ప్రభుత్వానికి నివే దించి అతడిపై పీడీ యాక్టు ప్రయోగించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, ఊపేక్షించేదిలేదని ఎస్పీ హెచ్చరించారు.