Share News

గంజాయి కేసులో ఒకరిపై పీడీ యాక్టు

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:45 AM

గంజాయి కేసులో నిందితుడు, రౌడీషీటర్‌ గావు దుర్గారావుపై పీడీ యాక్టు ప్రయోగించినట్టు ఎస్పీ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

గంజాయి కేసులో ఒకరిపై పీడీ యాక్టు

విజయనగరం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో నిందితుడు, రౌడీషీటర్‌ గావు దుర్గారావుపై పీడీ యాక్టు ప్రయోగించినట్టు ఎస్పీ దామోదర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయికి సంబంధించి పలు కేసులు ప్రస్తుతం పలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని, విజయనగరం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందని చెప్పారు. జిల్లాలోని భోగాపురం మండలం రెడ్డి కంచేరుకు చెందిన గావు దుర్గారావు(37) గంజాయికి సంబంధించి మూడు కేసులు, కొట్లాటకు సంబంధించి రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం ఆయా కేసులు వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పెదమానాపురం పోలీసుస్టేషన్‌లో రెండు కొట్లాట కేసులు, తిరుపతి జిల్లా రేణి గుంట పోలీసుస్టేషన్‌లో ఒక గంజాయి కేసు నమోదైందన్నారు. దుర్గారావు ప్రవ ర్తన సమాజానికి ప్రమాదకరంగా, తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాంతి భద్రత లకు విఘాతం కలిగించే విధంగా ఉందని ప్రభుత్వానికి నివేదించి, ఒక ఏడాది పాటు బెయిల్‌పై విడుదల కాకుండా పీడీ యాక్టు అమలు చేశామని ఎస్పీ తెలి పారు. నిందితులు నేర ప్రవృత్తిని విడనాడాలని, చట్టాన్ని గౌరవిస్తూ, సత్ప్రవర్తన తో జీవించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - Sep 25 , 2026 | 12:45 AM