Share News

గంజాయి కేసులో పీడీ యాక్టు

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:15 AM

జిల్లాలోని తెర్లాం మండలం పెరు మాళి గ్రామానికి చెందిన జరజాన శ్రీరామ్‌ తరచూ గంజాయి అక్రమ రవాణాకి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పీడీ యాక్టు అమలు చేసి విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకి తరలించినట్టు ఎస్పీ దామోదర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

గంజాయి కేసులో పీడీ యాక్టు

విజయనగరం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తెర్లాం మండలం పెరు మాళి గ్రామానికి చెందిన జరజాన శ్రీరామ్‌ తరచూ గంజాయి అక్రమ రవాణాకి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పీడీ యాక్టు అమలు చేసి విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకి తరలించినట్టు ఎస్పీ దామోదర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్‌పై ఇప్పటికే తెర్లాం పోలీసుస్టేషన్‌లో రెండు, బుదరాయవలస పీఎస్‌ పరిధిలో ఒకటి గంజాయి కేసు నమోదైందని చెప్పారు. నేర ప్రవృత్తిని మార్చుకోకుండా పదే పదే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడు తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా పీడీ యాక్టు కింద నిర్బంధ చర్యలు చేపడుతున్నామన్నారు. ముంద స్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని ఏడాది వరకూ బెయిల్‌ రాకుండా విశాఖ సెంట్రల్‌ జైలుకి తరలించామని తెలిపారు.

Updated Date - Oct 26 , 2026 | 12:15 AM