గంజాయి కేసులో ఇద్దరిపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:01 AM
గంజాయి కేసులో ఇద్దరు నింది తులపై పీడీ యాక్ట్ అమలు చేసి, జైలుకు తరలించామని ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం తెలిపారు.
విజయనగరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో ఇద్దరు నింది తులపై పీడీ యాక్ట్ అమలు చేసి, జైలుకు తరలించామని ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లంకా పట్నానికి చెందిన వానపల్లి బలరాం(37) అలియాస్ బుద్ద, విశాఖకు చెందిన ప్రస్తుతం దాసన్నపేట సింగపూర్ సిటీ డాల్ఫిన్ హైట్స్‌లో ఉంటున్న తంగేటి శరత్(35)లు తరచూ గంజాయి అక్రమ రవాణా చేస్తూ అసాంఘిక కార్యకలాపా లకు పాల్పడుతున్నారు. ఈ మేరకు వీరిపై గతంలో కేసులు నమోదయ్యాయి. వీరికి పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చి సన్మార్గంలోకి మార్చేందుకు ప్రయ త్నించినా, నేర వృత్తిని మానలేదు. దీంతో వీరిద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి, విశాఖ సెంట్రల్ జైలుకుతరలించారు.