Share News

గంజాయి కేసుల్లో ఒమ్మివాసిపై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:21 AM

తరచూ గంజాయి అక్రమ రవా ణాతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఒమ్మి గ్రామానికి చెంది న లోపింటి నాగరాజుపై పీడీ యాక్ట్‌ అమలుచేసి, విశాఖ సెంట్రల్‌ జైలుకు సో మవారం తరలించినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

గంజాయి కేసుల్లో ఒమ్మివాసిపై పీడీ యాక్ట్‌

రాజాం రూరల్‌, అక్టోబరు 26(ఆంరఽధజ్యోతి): తరచూ గంజాయి అక్రమ రవా ణాతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఒమ్మి గ్రామానికి చెంది న లోపింటి నాగరాజుపై పీడీ యాక్ట్‌ అమలుచేసి, విశాఖ సెంట్రల్‌ జైలుకు సో మవారం తరలించినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నాగ రాజుపై తెర్లాం, బుదరాయవలస పోలీస్‌స్టేషన్లలో రెండు గంజాయి కేసులు నమో దయ్యాయని ఎస్పీ చెప్పారు. నిందితుడు నేరప్రవృత్తి మార్చుకోకుండా పదేపదే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో నాగరాజుపై పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ చర్యలు చేపట్టామన్నారు. నాగరాజును చీపురుపల్లి సీఐ శంకరరావు అదుపులోనికి తీసుకుని ఏడాది వరకూ బెయిల్‌ రాకుండా విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించారని ఎస్పీ తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 12:21 AM