Share News

గంజాయి కేసులో వ్యక్తిపై పీడీ యాక్టు

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:18 AM

తరచూ గంజాయి అక్రమ రవా ణాకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సోమవారం తెలిపారు.

గంజాయి కేసులో వ్యక్తిపై పీడీ యాక్టు

విజయనగరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): తరచూ గంజాయి అక్రమ రవా ణాకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సోమవారం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామానికి చెందిన దాసరి గాంధీ అనే యువకుడిపై పలు స్టేషన్‌లలో గంజాయి కేసు నమోదు చేసి ఉన్నారు. నిందితుడిలో నేర పరివర్తన, ప్రవృత్తిని విడిచి పెట్టేందుకు ఎంత కృషి చేసినప్పటికీ, మార్పు రాకపోవడంతో ఒక ఏడాది వరకూ బెయిల్‌ రాకుండా పీడీ యాక్టు అమలు చేసి.. సోమవారం సెంట్రల్‌ జైలుకు తరలించామని చెప్పారు. నిందితుడిపై ఇప్పటికే రెండు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ జి.శంకరరావు, గుర్ల పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:18 AM