Share News

ధాన్యం సేకరణ సిబ్బంది వేతనాల చెల్లింపు

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:52 PM

: మండలంలో ఖరీఫ్‌లో ఆర్‌ఎస్‌కే, పీఏసీ ఎస్‌ల ద్వారా ధాన్యం సేకరించిన డేటాఎంట్రీలు, టెక్నీకల్‌ అసిస్టెంట్లు, సహాయకులకు ఎమ్మెల్యే లలితకుమారి వేతనాలు అందజేశారు.

  ధాన్యం సేకరణ సిబ్బంది వేతనాల చెల్లింపు
డేటా ఎంట్రీలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి:

లక్కవరపుకోట, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మండలంలో ఖరీఫ్‌లో ఆర్‌ఎస్‌కే, పీఏసీ ఎస్‌ల ద్వారా ధాన్యం సేకరించిన డేటాఎంట్రీలు, టెక్నీకల్‌ అసిస్టెంట్లు, సహాయకులకు ఎమ్మెల్యే లలితకుమారి వేతనాలు అందజేశారు.ఈమేరకు ప్రభుత్వం విడుదల చేసిన లక్షా వెయ్యి రూపాయలను పీఏసీఎస్‌ అధ్యక్షులు మరోతి రామారావు సమక్షంలో పంపిణీచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, మాజీ సర్పంచ్‌లు యడ్ల ఈశ్వరరావు, కొట్యాడ ఈశ్వరరావు, కొట్యాడ రాముడు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 11:52 PM